TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గౌరీ లంకేష్‌ను అందుకే చంపారట!

Published on: Mon Jun 4, 2018 10:48AM

 

ఏడాది క్రితం కర్నాటకలో జరిగిన గౌరీలంకేష్‌ హత్య ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. అప్పటి వరకు ప్రజలు పెద్దగా పట్టించుకోని హిందూ అతివాదం ఎంత భయంకరమైందో ఈ హత్య నిరూపించింది. ఈ హత్య తర్వాతనే దక్షిణభారతదేశంలో లౌకికవాదులు తమ గొంతుకను గట్టిగా వినిపించడం మొదలుపెట్టారు. దాంతో మొదట్లో ఈ హత్య గురించి పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం కూడా కఠినమైన విచారణ జరిపించాల్సి వచ్చింది. ఈ విచారణలో కె.టి. నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ హత్యలో ప్రధాన నిందితుడని తేలింది. ‘హిందూ ధర్మానికీ, హిందూ దేవుళ్లకీ వ్యతిరేకంగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని అవమానించినందుకు’గాను లంకేష్‌ను చంపినట్లు నిందితుడు అంగీకరించాడు.