సామాన్యుడిపై బండ

 

ధరలు పెంచుకునే అధికారం చమురు కంపెనీలకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి జీవితంతో ఆడుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు పెట్రోల్‌ డిజిల్‌ రేట్లు పెంచుతూ సామాన్యుడి నడ్డివిరిచిన చమురు కంపెనీలు ఇప్పుడు మరో బండనేశాయి.

ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో బతకటమే కష్టం అనుకుంటున్న ప్రజలపై ఇప్పుడు మరోభారం మోపారు.. ఒకేసారి ఏకంగా 62 రూపాయలు గ్యాస్‌ ధన పెంచారు. దీంతో సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్‌ ధర 1025రూపాయలకు చేరింది.

దీంతో పాటు నగదు బదిలీ పదకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్న సొమ్ముతో కలిపి ఇక పై ప్రతి సిలిండర్‌పై 116 రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. సబ్సిడీ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు అవి ఇవ్వక పోగా పన్నుల పేరుతో మరింత భారమోపడాన్ని సామన్య ప్రజలు తప్పుపడుతున్నారు.