TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రజారాజ్యం పార్టీలో ఇద్దరికి మంత్రి పదవులు

Published on: Thu Jan 19, 2012 9:02AM

హైదరాబాద్:ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు,సి.రామచంద్రయ్యలు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్భవన్లో ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి ఈరోజు ఉదయం 11.45 నిమషాలకు ముహుర్తం ఖరారైంది. దాంతో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

మంత్రి వర్గం విస్తరణ క్రీడలో చివరికి మెగాస్టార్ చిరంజీవి నెగ్గారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. పిసిసి బొత్స సత్యనారాయణకు కళ్లెం వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరితో పాటు మరో ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని, ముగ్గురు పాత మంత్రులకు ఉద్వాసన పలకాలని కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేశారు. అందుకు అధిష్టానాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే, అధిష్టానం అంగీకరించినట్లే అంగీకరించి చివరి నిమిషంలో తిప్పికొట్టింది