TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గంజాయి మాఫియాకు అడ్డాగా మారిన ఉత్తరాంధ్ర

Published on: Wed Aug 8, 2012 8:10AM

ఉత్తరాంధ్ర జిల్లాలను స్మగ్లర్లు అడ్డాగా చేసుకున్నారు. ఒకవైపు కలప, మరోవైపు గంజాయిస్మగ్లింగు చేస్తున్న ఈ జిల్లాల్లోని పేదల వెనుక మాఫియా ముఠాలున్నాయని అథికారిక సమాచారం. ముంబయ్‌ నుంచి కొంత మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి అక్కడ గంజాయి సాగుకు మాఫియానేతలే ఫైనాన్స్‌ చేస్తున్నారు. సక్రమంగా సరుకు ముంబయి చేరితే పేమెంటు 25శాతం పెంచి ఇస్తున్నారని సమాచారం. అందుకే ముందుగా అడ్వాన్సులు తీసుకుని సరుకుని ముంబయ్‌ పంపించాక మిగిలిన డబ్బు తీసుకుంటామని ఉత్తరాంధ్ర పేదలు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఒకవేళ పట్టుబడితే మాఫియాలో ఉన్న తమ పేరు బయటకు చెప్పకుండా ఉండేందుకు కూడా కొంతసొమ్మును కేటాయిస్తున్నారట. అలానే తేడా వస్తే కుటుంబసభ్యులపై దాడికి కూడా వెనుకాడబోమని మాఫియా నేతలు చేసే హడావుడికి పేదగిరిజనులు బలవుతున్నారు.

 

ఇప్పటిదాకా గంజాయి రవాణాలో పోలీసులకు పట్టుబడినవారిలో ఎక్కువమంది గిరిజనులని అథికారులు వివరిస్తున్నారు. అసలు నిందితులు దొరకటం లేదని ఈ కేసులు దర్యాప్తు చేసే పోలీసులే స్పష్టం చేస్తున్నారు. తాజాగా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం వద్ద వ్యానులో గంజాయి తరలిస్తునన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యానును స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకించి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీలో గంజాయిసాగవుతోందని పోలీసులు ధృవీకరిస్తున్నారు. తాజాగా చర్లపల్లి జైలులో రిమాండు ఖైదీ వద్ద వందగ్రాముల గంజాయి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. నైజీరియాకు చెందిన బిస్బా అసలు గంజాయి అక్రమరవాణా కేసులోనే నిందితుడు. అతని వద్దకు ఈ గంజాయి ఎలా వచ్చిందనే విషయమై ఆసక్తి నెలకొంది.