నయీమ్‌తో ఫ్రెండ్‌షిప్ నిజమే-నేతి విద్యాసాగర్
Published on: Sun Mar 5, 2017 3:50PM

కరడుగట్టిన గ్యాంగ్‌స్టార్ నయీమ్ కేసులో సిట్ విచారణ మరింత వేగవంతమైంది. నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో తనకు నయీమ్‌తో స్నేహం ఉందని ఆయన అంగీకరించారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ భార్య భూమి కొన్నట్లు విచారణలో గుర్తించారు..అయితే నయీమ్ కేసులో విద్యాసాగర్‌ను ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించారు.


