TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గంగకు సైతం రాజకీయ కాలుష్యం

Published on: Thu Aug 16, 2012 9:14AM

భారతదేశంలో నదులకు ప్రత్యేకమైన, పవిత్రమైన స్థానం ఉంది. ముఖ్యంగా గంగానది. అయితే ప్రజలందరూ ఎంతో పవిత్రంగా భావించే గంగాజలం కలుషితమైపోతోంది. నది పొడవునా ఉన్న జనావాసాల్లోని మురుగునీరు, నదికి సమీపంలోని పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధాలతో పాటు, వ్యవసాయంలో ఉపయోగించే నిషేధిత క్రిమిసంహారక మందులు సైతం గంగానదిలో చేరి ఆ జల కాలుష్యం ఏర్పడుతోందని ఢల్లీ ఐఐటీ అధ్యయనంలో వెల్లడయింది. అయితే గంగానదిలోకి చేరిన పలు కాలుష్యాలను ప్రక్షాళన చేసేందుకు 1985 నుండి గంగా కార్యాచరణ ప్రణాళిక (జిఎపి) అమలు జరుగుతోంది.


 

జాతీయ గంగానదీ పరీవాహక సంస్థ  క్రింద రూ.7.000కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణకు అనుమతి లభించగా, గంగానదీ పరివాహక పట్టణాలలో గంగానది కాలుష్య నివారణ చర్యలను చేపట్టేందుకు రూ.1,441 కోట్లు విడుదల చేశారు.  గంగానదీ పరీవాహక ప్రాంతంలో జలకాలుష్యంఎక్కువవుతున్నది. పరిశ్రమల కారణంగా 20శాతం వరకు గంగానదీ కాలుష్యం జరుగుతోందని  సంబంధిత మంత్రివర్యులు తెలియజేశారు.



1985 నుండి అమలులోకి వచ్చిన జిఎపి ఇప్పటికి సుమారుగా 27 సంవత్సరాలు గడిచినా ఇంకా గంగానదిలోని కాలుష్యాన్ని అరికట్టలేకపోవడం చూస్తే గంగ ప్రక్షాళనకు సైతం రాజకీయ కాలుష్యం అంటుకుందేమో అనిపిస్తోంది.  గంగానదే  మానవరూపమెత్తి ఎన్నికల సమయంలో మీకు ఓటేస్తానంటే  తప్ప గంగానదీ కాలుష్య నివారణచర్యలు పూర్తికావేమో! నివారణ చర్యలకోసం నిధులనయితే విడుదల చేస్తారు కాని పూర్తి స్థాయిలో వాటి అమలే ప్రశ్నార్ధకంగా మారుతోంది.