TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సినిమా చూపిస్తాననీ..బాలికపై స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్

Published on: Mon May 29, 2017 3:34PM

సినిమా చూపిస్తాననీ మాయ మాటలు చెప్పి విద్యార్ధినిపై స్నేహితులతో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అసలు వివరాల్లోకి వెళితే బెంగళూరు నగరంలోని పిణ్యా ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ యువకుడికి అదే ప్రాంతంలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలికతో స్నేహం పెంచుకున్నాడు. ప్రతీ రోజు ఏదో ఒక వంకతో బాలికతో మాటలు కలపడంతో వారి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో గత ఆదివారం సినిమాకు వెళదామని చెప్పి బాలికను తీసుకెళ్లాడు. ఇద్దరూ సినిమా చూసిన అనంతరం బయటకు వచ్చారు. అనంతరం పిణ్యాలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

 

అంతటితో ఆగకుండా స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు. మళ్లీ స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాత్రి వరకు అదే భవనంలో బాలికను నిర్బంధించిన ఆ కామాంధులు తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను అక్కడే వదిలి పారిపోయారు. ఇంటికి వెళ్లడానికి భయపడిని బాలిక తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంది. ఐదు రోజులైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పిణ్యా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఆచూకీని కనుగొన్నారు. అనంతరం జరిగిన దారుణాన్ని పోలీసులకు, తల్లిదండ్రులకు చెప్పింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఇద్దరు మైనర్లు.