వినాయక నిమజ్జనంలో విషాదం.. ఐదుగురి మృతి
Published on: Sun Sep 14, 2014 9:46PM

గణేశ నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న సమయంలో విషాద సంఘటన జరిగింది. కరెంట్ షాక్ కొట్టడంతో ఐదుగురు మరణించారు. కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర తాలూకా మధురె కనకవాడి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన వారు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లారు. వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్కు తెగిపడి ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైరు తగిలింది. దాంతో విద్యుత్ షాక్కు అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురుకి కాలిన తీవ్ర గాయాలయ్యాయి.


