ఘ‌నంగా గ‌ణేషునికి విడ్కోలు

 

భాగ్యన‌గ‌రం కాషాయ‌రంగు పులుముకుంది. తొమ్మిది రోజులుగా పూజ‌లందుకుంటున్న గ‌ణ‌నాధుడు ఇక సెల‌వంటూ క‌దులుతున్నాడు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను రాష్ట్రా ప్రభుత్వం జిహెచ్ ఎంసి అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. హుస్సెన్ సాగ‌ర్‌తో పాటు న‌గ‌రంలోని 24 చెరువుల్లో నిమ‌జ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

అయితే ఇన్ని చోట్ల ఉన్న హుస్సేన్‌సాగ‌ర్‌లో జ‌రిగే నిమ‌జ్జనానికి ప్రత్యేక‌త ఉంది. ఈ సారి దాదాపు 60 వేల‌కు పైగా విగ్రహాలు హుస్సేన్‌సాగ‌ర్‌లో నిమ‌జ్జనం చేస్తార‌ని అంచ‌నా.దీంతో హుస్సేన్‌సాగ‌ర్ ప్రాంత‌ల్లోప‌టిష్టమైన భ‌ద్రత ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ ప‌రిదిలో 15 వేల మందితో, సైబ‌రాబాద్‌ ప‌రిదిలో 7,500 మందితో భ‌ద్రత ఏర్పాట్లు చేశారు.

హుస్సేస్‌సాగ‌ర్ చుట్టూ 33 ఫ్లాట్ ఫారాల‌తో పాటు 59 భారీ మొబైల్ క్రేన్‌లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే సంద‌ర్శకుల కోసం 14 ల‌క్షల వాట‌ర్ ప్యాకెట్‌ల‌ను కూడా సిద్దం చేశారు. ఈ వినాయక నిమ‌జ్జన నేప‌ధ్యంలో జంట‌న‌గ‌రాల్లో సెల‌వు ప్రక‌టించారు.