TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి తప్పనిసరి

Published on: Fri Aug 31, 2012 5:23PM

హైదరాబాద్ లో గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు సంబంధిత ప్రాంత ఎసిపి అనుమతి విధిగా పొందాల్సిందేనని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. అలాగే గణేష్‌ ఉత్సవాల పేరిట ఏ రూపంలోనూ చందాలు వసూలు చేయ్యకూడదని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షించడం జరుగుతుందని సిపి హెచ్చరించారు. అయితే ` ఇప్పటికే ప్రారంభమైన వసూళ్ళ గురించి పోలీసులు ఆరాతీస్తే బావుంటుందని ప్రజలు అంటున్నారు. గణేష్‌ ఉత్సవాల సమయంలో చెవులు హోరెత్తించే మైకు శబ్దాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలనీ, అలాగే` పాఠశాలలు, వైద్యశాలల ప్రాంతంలో గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు అనుమతులు ఇవ్వవద్దని ప్రజలు విజ్ఞప్తి చూస్తున్నారు.