గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా..

 

భాగ్యన‌గ‌రం పండుగ శోభ సంత‌రించుకుంది. వాడ‌వాడ‌ల వినాయ‌క మండ‌పాలు వెళిశాయి. విఘ్నాల‌ను తొల‌గించాలంటూ ప్రజ‌లంద‌రూ ఆ విఘ్నేశ్వరుణ్ణి భ‌క్తి శ్రద్దల‌తో కొలుస్తున్నారు. ఎప్పటి లాగే ఖైర‌తాబాధ్ తో పాటు ప‌లు చోట్ల భారీ గ‌ణ‌నాధులు కొలువు తీరి భ‌క్తుల‌ను అనుగ్రహిస్తున్నారు.

భ‌క్తులు ఇష్టా ఇష్టాలు అభిష్టాల‌కు త‌గిన‌ట్టుగా ర‌క‌ర‌కాల ఆకారాలు భంగిమ‌ల‌లో గ‌ణ‌నాధుడు మండ‌పాల‌లో కొలువుదీరాడు. అయితే ప్రతి సారి క‌న్నా ఈ సారి భ‌క్తుల్లో మ‌ట్టి వినాయ‌కుల మీద అవ‌గాహ‌న పేరింగింది. ఇళ్లలో పూజ చేసుకునే భ‌క్తులతో పాటు మండ‌పాల్లో అలంక‌రించిన భారీ గ‌ణ‌నాధుల‌ను కూడా మ‌ట్టితో త‌యారు చేసి ప్రతిష్టించారు.

ఇక గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నగర పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు మండపాల వద్ద బాణాసంచా పేల్చడంపై నిషేధం విధించారు. ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున అందుకు తగ్గట్లు పది రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.