TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గాంధీ హత్యపై గాడ్సే ఏం చెప్పాడు..?

Published on: Mon Feb 20, 2017 11:53AM

నాథూరాం గాడ్సే..ఈ పేరు వినగానే జాతిపిత మహాత్మాగాంధీ హత్య గుర్తుకు వస్తుంది..ఆ తరం వారికి అసలు ఆ రోజు ఏం జరిగిందో..ఎందుకు గాంధీని హత్య చేశాడో తెలిసింది కొద్ది మందికే..కాని నేటి తరానికి దీని గురించి తెలిసింది శూన్యం. అయితే అశుతోష్ బన్సాల్ అనే వ్యక్తి మాత్రం అందిరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాడు. గాంధీని గాడ్సే ఎందుకు హత్య చేశాడో తెలుసుకోవాలని అందుకు సమాచార హక్కు చట్టాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. ఈ మేరకు ఆర్‌టీఐ యాక్ట్ కింద గాంధీ హత్య కేసు వివరాలు, గాడ్సే వాంగ్మూలం తనకు అందించాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు.

 

 

దీనిని పరిశీలించిన ఉన్నతాధికారులు ఈ దరఖాస్తును ఎన్ఐఏ( నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా)కు బదిలీ చేశారు. అయితే ఆ వివరాలను తమ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చంటూ దరఖాస్తుదారుడికి ఎన్ఐఏ సూచించింది. ఆ సమాధానంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బన్సాల్..తాను కోరిన సమాచారాన్ని ఎన్ఐఏ అందించలేదంటూ కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కేంద్ర సమాచార కమిషనర్ మాడభాషి శ్రీధర్ దరఖాస్తుదారుడి నుంచి పేజీకి రూ.2 చొప్పున వసూలు చేస్తూ 20 రోజుల్లోగా గాంధీ హత్య కేసు పత్రాలు, గాడ్సే వాంగ్మూలాన్ని సీడీ రూపంలో అందించాలని ఆదేశించారు.