కేశినేని కోసం గల్లా జయదేవ్ పదవి త్యాగం!!

 

టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ లోక్ సభ విప్ పదవిని కూడా కేశినేని తిరస్కరించారు. ఈ విషయంలో చంద్రబాబు స్వయంగా ఇంటికి పిలిపించుకుని మాట్లాడినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ పార్టీ అధినేత చంద్రబాబుతో ఈరోజు మరోసారి సమావేశం అయ్యారు. తనకు ఎలాంటి బాధ్యతలు లేకపోయినా ఫరవాలేదని చంద్రబాబుకు గల్లా చెప్పినట్లు తెలుస్తోంది. తనకు పార్లమెంటరీ పార్టీ నేత పదవిని అప్పగించడంపై నాని అలిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవిని వదులుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు గల్లా జయదేవ్ తెలిపినట్లు సమాచారం.