TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ మీ మౌనం అది అంగీకరిస్తున్నట్టుంది..

Published on: Fri May 4, 2018 11:41AM

 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి ట్విట్టర్ వేదికగా తన పవన్ పై విమర్శలు గుప్పించారు. గత వారం రోజులుగా గల్లా జయదేవ్ కు, పవన్ కు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు.  "పవన్ కల్యాణ్ గారూ... మీపై వ్యక్తిగత విమర్శల దాడి జరిగిందని ఆరోపిస్తూ, మీరు మీడియాపై దాడికి దిగారు. మీ అభిమానులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తప్పుడు భాష వాడుతున్నారు. శరీరాకృతిపై మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మీ మౌనం పరోక్షంగా దీనిని మీరు అంగీకరిస్తున్నట్టు, ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.