TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజగోపాల్ బెయిల్‌పై హైకోర్ట్ తీర్పు వాయిదా

Published on: Wed Dec 21, 2011 3:57PM

హైదరాబాద్: గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి రాజగోపాల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనిపై హైకోర్టు సోమవారం నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయి. రాజగోపాల్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. సాక్షులను ఇప్పటికే బెదిరించిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని సిబిఐ చెప్పింది. కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెవెన్యూ అధికారులు బుధవారం సిబిఐ ముందు హాజరయ్యారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు విచారణను సిబిఐ ముమ్మరం చేసింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు విచారణ కూడా వేగంగా జరుగుతోంది.