TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాలి సరస్వతమ్మ ఏకగ్రీవ ఎన్నిక..

Published on: Tue May 8, 2018 1:08PM

 

టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈయన స్థానం ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ పదవి  గాలి సరస్వతమ్మకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించుకున్న సంగతి కూడా విదితమే. దీనిలో భాగంగానే..గాలి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆమెకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎంపీ శివప్రసాద్‌, జడ్పీ చైర్మన్‌ గీర్వాణి, ఎమ్మెల్సీ దొరబాబు, పులివర్తి నాని, మేయర్‌ హేమలత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ...తన ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించినవారందరికీ గాలి సరస్వతమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి ఆశయాలను నెరవేరుస్తానని ఆమె అన్నారు.