TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పదేళ్ల తర్వాత గాలి జనార్థన్ రెడ్డి ఎంట్రీ...

Published on: Thu Jan 13, 2022 2:25PM

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బళ్లారి గడ్డపై మైనింగ్ టైకూన్ గాలి జనార్ధన్ రెడ్డి అడుగుపెట్టారు. అక్రమ మైనింగ్ కేసుల్లో షరతుల బెయిల్ మీద గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఇంతకాలంగా ఆయనకు సొంత ఊరు బళ్లారిలో అడుగు పెట్టడానికి అనుమతి లేదు. అయితే.. సీబీఐ కోర్టు తాజాగా గాలి జనార్ధన్ రెడ్డికి అనుమలి ఇవ్వడంతో బళ్లారి గడ్డపై ఆడంబరంగా అడుగుపెట్టారు. గతంలో ఒకటి రెండు సార్లు ప్రత్యేక అనుమతులతో బళ్లారి వచ్చినా ఈ సారి మాత్రం మళ్లీ బయటికి వెళ్లాల్సిన అవసరం లేదనే జోష్ జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల్లోనూ కనిపించింది.

బళ్ళారిలో అడుగుపెట్టిన గాలి జనార్దన్ రెడ్డికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. బళ్లారిలోని కనకదుర్గమ్మ గుడిలో గాలి జనార్ధన్ రెడ్డి తులాభారం సమర్పించి, అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఈ సందర్బంగా ఉద్వేగానికి గురయ్యారు గాలి జనార్దన్ రెడ్డి. సుమారు పదేళ్ల పాటు బళ్ళారికి దూరంగా ఉండాల్సి రావడం దురదృష్టకరం అన్నారు. కష్ట కాలాల్లో బళ్ళారి ప్రజలు తమ కుటుంబానికి అండగా ఉన్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. తన జన్మదినాన్ని అభిమానుల మధ్య జరుపుకొన్నారు. ఇక నుంచి బళ్ళారిలోనే ఉండి ఈ ప్రాంతానికి సేవ చేసుకుంటానని గాలి జనార్ధన్ రెడ్డి చెప్పారు.