TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ ఏడు కోట్లు 'గాలి' సొమ్మేనా?

Published on: Thu Nov 8, 2012 2:20PM

gali janardhan reddy, gali janardhan reddy jail, 7 Cr Cash Seized hyderabad, 7 Cr Cash found in auto, 7 Cr Cash auto,  7 Cr Cash

 

రాష్ట్ర పోలీసు ప్రధాన అధికారి డీజీపీ కార్యాలయం ఎదుట ఆటోలో దొరికిన రూ.6.75 కోట్లు కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల తవ్వకం కేసులో జైలు జీవితం గడుపుతున్న గాలి జనార్ధన్ రెడ్డికి చెందినవా. ఏకంగా ఏడు కోట్ల రూపాయలను ఎలాంటి భద్రత లేకుండా ఎంచక్కా ఆలోచిస్తున్న సదరు వ్యక్తులు పోలీసులు కంటపడగానే పరారు కావడం చర్చానీయాంశంగా మారింది. మొత్తం 1000 రూపాయలు కట్టలు కట్టిన కొత్త నోట్లు. ఇంతటి భారీ మొత్తాన్ని తరలిస్తున్నారంటే ఖచ్చితంగా అది రాజకీయ నాయకులకు చెందినదే అన్న అనుమానాలు వస్తున్నాయి.

 

gali janardhan reddy, gali janardhan reddy jail, 7 Cr Cash Seized hyderabad, 7 Cr Cash found in auto, 7 Cr Cash auto,  7 Cr Cash

 

కర్నాటకలో రోజు రోజుకూ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ కార్యకలాపాలకోసమే ఈ డబ్బు తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ డబ్బులు కూడా స్టేట్ బ్యాంక్ మైసూర్ నుండి డ్రా చేసిన నేపథ్యం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేల డబ్బుగా అనుమానిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపితే గాని అసలు విషయం తేలదు.