TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గాలి జనార్థన రెడ్డికి ఊరట... రూ.884 కోట్లు జప్తు రద్దు..

Published on: Tue Mar 14, 2017 10:33AM

 

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డి గత కొన్ని ఏళ్లుగా అక్రమాస్తుల కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఆస్తుల స్వాదీనం విషయంలో ఆయనకు కొద్దిపాటి ఊరట కలిగింది. 2011లో అక్రమాస్తుల నేపథ్యంలో భాగంగా గాలి జనార్థనరెడ్డి, ఆయన భార్య అరుణాలక్ష్మీ లపై ఈడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. జనార్దనరెడ్డికి చెందిన గనుల సంస్థ, బ్రాహ్మణి ఉక్కు, ఆయన ఇల్లు, హెలికాప్టర్లను జప్తుచేసి... వీటి మొత్తం విలువ రూ.884 కోట్లని.. వీటిని గాలి జనార్థన్ రెడ్డి అక్రమంగా సంపాదించారని ఆరోపిస్తూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు  ఆస్తుల స్వాధీనం విషయంలో ఈడీ ఆదేశాలు చెల్లవని...2009లో కేంద్రం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(పీఎంఎల్) చట్టానికి సవరణలు చేసిందని, కాబట్టి అంతకుముందున్న నిబంధనల ప్రకారం ఈడీ ఆదేశాలు చెల్లవంటూ తేల్చి చెప్పింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డికి ఊరట లభించింది.