మరో కేసులో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్
Published on: Fri Nov 20, 2015 2:03PM
.jpg)
మరో కేసులో గాలి జనార్దన రెడ్డి అరెస్ట్ అయ్యారు. కర్ణాటకలోని లోకాయుక్త సిట్ పోలీసులు గాలి జనార్ధన రెడ్డిని అరెస్ట్ చేశారు. బేళికెరెలో ఇనుప ఖనిజం మాయం కేసులో జనార్ధన రెడ్డి అరెస్ట్ అయ్యారు. కాగా గతంలో మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డిని అక్రమంగా ఇనుప ఖనిజాలు విదేశాలకు తరలిస్తున్నాడని అరెస్ట్ అయిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ఆయన మూడు సంవత్సరాలు జైలు జీవితం కూడా అనుభవించారు.


