గాలి కేసులో ఇంప్లీడ్ అవుతా: నాగం
Published on: Mon Dec 19, 2011 11:59AM
హైద
రాబాద్: అవసరమైతే గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసులో తాను ఇంప్లీడ్ అవుతానని,సిబిఐకి సమాచారమందిస్తామని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.ఈ కేసులో దోషులే సాక్షులు అవుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులను ఇంకా ఎంతకాలం దోచుకుంటారని ప్రశ్నించారు. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందన్నారు. మద్యం సిండికేట్లపై ఎసిబి దాడుల్లో బయటపడుతున్న నేతల పేర్లను బహిర్గతం చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడులు రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం చేయాలని సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగరన్నారు. మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు పగటి పూట గజదొంగలుగా మారారన్నారు. మద్యం అక్రమాలకు పాల్పడ్డ వారిపై 420 సెక్షన్ క్రింద కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


