శ్రీలక్ష్మికి షాక్..బెయిల్ రద్దు
Published on: Mon Jan 2, 2012 10:49AM
హైద
రాబాద్: గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసులో అరెస్ట్ అయి విడుదలైన సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకి నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ నెల 6వ తేదీ లోపల నాంపల్లి కోర్టులో లొంగిపోవాలని ఆమెని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో శ్రీలక్ష్మిని నవంబరు 28న సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. డిసెంబరు 2న నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్నతరువాత ఆమెకు ఇచ్చిన బెయిల్ని హైకోర్టు రద్దు చేసింది.


