సిబిఐ పిటిషన్ పై శ్రీలక్ష్మికి హైకోర్టు ఆదేశం
Published on: Fri Dec 23, 2011 11:22AM
హైద
రాబాద్: గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. సిబిఐ పిటిషన్‌పై ఈ నెల 26వ తేదిలోగా కౌంటర్ దాఖలు చేయాలని శ్రీలక్ష్మిని హైకోర్టు ఆదేశించింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మిని సిబిఐ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె బెయిల్ పొంది ఇప్పుడు బయట ఉంది. అమెకు బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లపై శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.


