గెయిల్ విషాదం: పెరుగుతున్న మృతుల సంఖ్య
Published on: Sun Jun 29, 2014 1:48PM

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ సృష్టించిన మారణహోమంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 18కి పెరిగింది. పేలుడు జరిగిన శుక్రవారం 16 మంది మృతిచెందగా.. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయుడు సూర్యనారాయణ, మహమ్మద్ తక్వి మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్లు విడుదల చేస్తున్నారు.


