TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిసెంబర్ లో గగన్ యాన్!

Published on: Wed Aug 21, 2024 11:11AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో  వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకుపోతున్నది. తాజాగా ప్రతి కూల పరిస్థితుల్లో సైతం పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్తో.. ఈ ఏడాదే గగన్ యాన్ ప్రాజెక్టును చేపట్టనున్నది.  దిల్లీలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో  మాట్లాడిన ఇస్రో చైర్మన్ సోమనాథ్,  మానవ రహిత గగన్‌యాన్‌ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబరులో చేపట్టనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించి అన్ని విభాగాల రాకెట్లు శ్రీహరి కోటకు ఇప్పటికే చేరుకున్నాయన్నారు.

మరోవైపు చంద్రయాన్‌ 4 మిషన్‌  2028లో చేపట్టే అవకాశాలున్నాయన్నారు. ఇటీవల పునర్వినియోగ వాహక నౌక పుష్పక్‌ను వరుసగా మూడోసారి ఇస్రో విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయంప్రతిపత్తిగల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఇస్రో పేర్కొంది.

మరోవైపు చంద్ర‌యాన్ 4, 5 డిజైన్లు పూర్తి అయ్యాయ‌ని, వాటికి ప్ర‌భుత్వం నుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, అక్కడ నుంచి రాళ్లు, మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోందన్నారు. అందులో భాగంగా చంద్రయాన్‌ 4, చంద్రయాన్‌ 5 డిజైన్లు పూర్తైనట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ఇవి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు.  వచ్చే ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే చంద్రయాన్‌-3 పూర్తయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో వివిధ శాఖల అవసరాల కోసం తక్కువ ఎత్తులో చేపట్టే నావిక్‌ రిసోర్స్‌శాట్‌, కార్టోశాట్‌ వంటి ప్రయోగాలు ఉన్నాయని‌ పేర్కొన్నారు. శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. .