TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెల్‌బోర్న్ వీధుల్లో... ఛీ పాడు...

Published on: Mon Dec 22, 2014 3:25PM

 

ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ మోడల్ గాబి గ్రెక్కో మాంఛి అందగత్తెగా గుర్తింపు పొందింది. అందంలో మాత్రమే కాదు.. ఆ అందాన్ని ఆరబోయడంలో కూడా ఈ ముద్దుగుమ్మకి మంచి గుర్తింపే వుంది. ఈ జనరేషన్‌లో గాబి గ్రెక్కో అందాలు చూసి మురిసిపోని కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ఆస్ట్రేలియాలో టాప్ మోడల్స్‌లో ఒకరిగా వుండటమే కాకుండా, హాలీవుడ్ సినిమాల్లో కూడా అవకాశాలు పొందుతున్న ఈ సుందరాంగికి నిన్న రాత్రి ఓ మంచి ముహూర్తంలో ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే, ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా మెల్‌బోర్న్ వీధుల్లో తిరిగితే ఎలా వుంటుంది? ఇదీ ఆ ఐడియా! అసలే అందగత్తె.. దానికితోడు అడిగేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అంతే తాను అనుకున్నట్టుగా బర్త్ డే బేబీలా తయారై మెల్‌బోర్న్ వీధులకెక్కేసింది. తనతోపాటు ఓ వీడియో కెమెరామన్‌ని కూడా వెంటబెట్టుకుని తీసుకెళ్ళింది. మెల్‌బోర్న్ వీధుల్లో ‘అలా’ తిరుగుతూ అదంతా వీడియో షూట్ చేయించింది. అర్ధరాత్రి అంకమ్మ శివాలు తరహాలో తమకు బట్టల్లేకుండా ఎదురుపడిన గాబి గ్రెక్కోని చూసి జనం బిత్తరపోయారు. ఈ పైత్యకారి ఓచోట పిల్లలుంటే అక్కడకి వెళ్ళి కూడా వాళ్ళందరి ముందు గంతులు వేసింది. ఈ తతంగాన్నంతా రికార్డు చేయించింది కదా.. ఆ వీడియో ఇంటర్నెట్లో పెట్టేసింది. ఇంకేం.. ఆస్ట్రేలియా మోడల్ ప్రపంచమంతా గగ్గోలు పెట్టింది. ప్రపంచమంతా ఆ వీడియోను కళ్ళింతింత చేసుకుని చూసింది. ఈ వ్యవహారాన్నంతా చూసిన మెల్‌బోర్న్ పోలీసులు గాబి గ్రెక్కో మీద న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. బట్టల్లేకుండా రోడ్డు మీద తిరిగితే తిరిగావుగానీ, చిన్న పిల్లల ముందు ‘ప్రదర్శన’ ఇచ్చి చాలా తప్పు చేశావంటూ కసురుకున్నారు. అయితే గ్రెక్కో మాత్రం తాను చేసింది తప్పని ఎంతమాత్రం అనుకోవడం లేదు. అర్ధరాత్రి పూట ఒక అందగత్తె నడి రోడ్డు మీద బట్టల్లేకుండా కనిపిస్తే జనం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలన్న ఉద్దేశంతో తాను ఇలా చేశానని అంటోంది.