రోబోలు స్టాఫ్‌గా జపాన్ హోటల్

 

ఏది ఏమైనా జపాన్ వాడి బుర్రేబుర్ర. సాంకేతికంగా ఏ విప్లవం తేవాలన్న జపాన్ వాడి తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా రోబోలను అడ్డదిడ్డంగా వాడుకోవడంలో జపాన్ వాడి తెలివితేటలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. జపాన్ రోబో సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఒక కొత్త పుంతను తొక్కింది. అది స్టాఫ్ అంతా రోబోలతో ఒక హోటల్ నిర్మాణం. అప్పుడెప్పుడో ఆటంబాబు పడి సర్వనాశనం అయిపోయిన నాగసాకి నగరం ఆ తర్వాత అభివృద్ధి పథంలోకి పయనించి ప్రపంచమంతా ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ఇప్పుడు ఈ నగరంలోనే ఆ అత్యాధునిక హోటల్ని ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో స్టాఫ్‌గా మనుషులెవరూ ఉండరు. అన్నీ రోబోలే. 72 రూములతో అత్యధునాతనంగా నిర్మించిన ఈ హోటల్ని ఈ ఏడాది జూలై నెలలో ప్రారంభించబోతున్నారు. హోటల్‌కి వెళ్ళిన కస్టమర్ల లగేజీని తీసుకోవడం, రిసెప్షనిస్టు, రూమ్ సర్వీస్... ఇలా అన్ని విషయాల్లోనూ రోబోలే పనిచేస్తాయి.