TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిధులున్నా రంగారెడ్డి జిల్లాను పీడిస్తున్న అనారోగ్యం?

Published on: Tue Oct 30, 2012 8:12AM

Funds, Districts, Ranga Reddy District, Officials, Funds to PHC's, NRHM Funds, Not Utilising Funds, Asha Workers Uniform, Untied Funds, Family Planning, Hospital Development, Annual Development, Janani Suraksha Scheme

 

అన్ని జిల్లాల్లోనూ ఆరోగ్య అవసరాలు తీర్చుకునేందుకు నిధుల కొరత వెంటాడుతోంది. అటువంటిది నిధులున్నా రంగారెడ్డి జిల్లాను అనారోగ్యం పీడిస్తోంది. అధికారుల అశ్రద్ధ, నిర్లక్ష్యం పరాకాష్టకు చేరటం వల్ల ఈ నిధులను వినియోగించుకోవటమే మానేశారు. రాష్ట్రరాజధానితో కలుపుకుని ఉన్న ఈ జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఎలా అని సామాజిక ఆరోగ్య పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఈ జిల్లాలోని అన్ని పీహెచ్‌సిలకు రూ.70.50లక్షలను రెండు సార్లు విడుదల చేశారు. అయితే ఈ నిధుల్లో సగం కూడా వినియోగించలేదని పరిశీలనలో తేలింది. జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అపారిశుధ్యం తాండవిస్తోంది. అంటురోగాలు ప్రబలుతాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులు గురించి అధికారులను ప్రశ్నిస్తే మౌనం వహిస్తున్నారు. జననీ శిశు సంరక్షణ కింద గతేడాది రూ.1.90లక్షలు విడుదల చేస్తే దాన్ని అస్సలు ఖర్చు పెట్టలేదు. దీంతో ఆ నిధుల విడుదల ఆగిపోయింది. మొత్తంగా గతేడాది ఈ నిధుల్లో రూ.4,440 ఖర్చు చేశారు. గతేడాది ఆశావర్కర్లకు యూనిఫారాలకు రూ.తొమ్మిది లక్షలు విడుదల చేశారు. ఆ నిధులు పక్కదారి పట్టడంతో ఈ ఏడాది ఆ నిధులు కూడా విడుదల కాలేదు. అలానే సబ్‌సెంటర్‌ అన్‌టైడ్‌ఫండ్స్‌, ఫ్యామిలీప్లానింగ్‌, హాస్పటల్‌ డెవలప్‌మెంట్‌, ఆన్యువల్‌ డెవలప్‌మెంట్‌ నిధులను సక్రమంగా వినియోగించకపోవటంతో వాటిని కూడా ఆపేశారని సమాచారం. కుటుంబనియంత్రణకు గతేడాది రూ.27.06లక్షలు విడుదలయ్యాయి. దీన్ని వినియోగించలేదు. అందువల్ల ఈ ఏడాది నిధులు తగ్గించేశారు. జననీసురక్ష పథకం నిధులు విడుదలైనా అదీ వినియోగించలేదని తెలుస్తోంది.