TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భిక్షాటన నుంచి పట్టా వరకు.. నెల్లూరులో అక్షర విప్లవం

Published on: Wed Apr 22, 2026 9:33AM

నిన్నటి వరకు బస్టాండ్ గోడల వారన ఐదు రూపాయల బువ్వ కోసం దీనంగా చేయి చాచిన ఆ చిన్నారులు..  నేడు   సూటూబూటూ ధరించి మెడలో మెడల్స్ వేసుకుని సింహాల్లా గర్జిస్తున్నారు. అనా థల రాతను మారుస్తూ  ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ   సంధించిన  అక్షరాయుధం నెల్లూరులో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మున్సిపల్ స్కూల్స్ భవనాలు చూసి ముగ్ధులై, భిక్షా పాత్రలను విసిరికొట్టి పుస్తకాలు పట్టిన ఆ చిన్నారుల పట్టుదల, నేడు వారిని సమాజం గర్వపడే హీరోలుగా నిలబెట్టింది.

ఇది కేవలం మార్పు మాత్రమే కాదు..  ఒక తరం తలరాతను తిరగరాసిన  ప్రస్థానం. భిక్షాటన స్థితి నుంచి మెడల్స్ అందుకునే స్థాయికి ఎదిగిన ఆ 180 మంది విద్యార్థుల విజయానికి నెల్లూరు నగరం పులకించిపోతోంది.  కమిషనర్ వై.ఓ. నందన్   చేతుల మీదుగా పట్టాలు అందుకున్న ఆ దృశ్యం.. అక్షరం తలుపు తడితే అనాథలు కూడా అధినేతలు అవుతారని నిరూపించింది. మంత్రి నారాయణ  అకుంఠిత దీక్ష,  మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో, చిరిగిన బట్టల వెనుక దాగి ఉన్న మేధస్సు నేడు పట్టభద్రుల రూపంలో బయటకు వచ్చింది.