ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫెదరర్‌కు షాక్
Published on: Wed Jun 5, 2013 11:31AM

ఫ్రెంచ్ ఓపెన్‌లో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు మళ్ళీ నిరాశే ఎదురైంది. నాలుగేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకోవాలని చూస్తున్న ఫెదరర్‌కు క్వార్టర్‌ఫైనల్ లో షాక్ తగిలింది. మంగళవారం ఇక్కడ జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యా చ్‌లో ఆరో సీడ్ ఫ్రాన్స్ ఆటగాడు ఆరో సీడ్ ఫ్రాన్స్ ఆటగాడు జో విల్‌ఫ్రెడ్ సోంగాతో తలపడిన ఫెదరర్ 5-7, 3-6, 3-6తో మూడు వరుస సెట్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తన ఆటతీరుకు భిన్నంగా ఆడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. తొలి సెట్‌లో గట్టి పోటీనిచ్చినా.. ఆ తర్వాతి రెండు సెట్లలో ప్రభావం చూపించలేక ప్రత్యర్థి ముందు మోకరిల్లాడు. మరో మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాడు డేవి డ్ ఫెర్రర్ సునాయాస విజయాన్ని నమోదు చేశాడు. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తనదేశానికే చెందిన టామీ రోబ్రెడోతో తలపడిన ఫెర్రర్.. 6-2, 6-1, 6-1తో వరుస సెట్లను చేజిక్కించుకుని సెమీస్ చేరాడు.


