కోవిడ్ పేషెంట్లకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఫ్రీ సర్వీస్
Published on: Mon Jan 31, 2022 1:54PM
కోవిడ్ పేషెంట్ల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో ఉచిత సేవా కార్యక్రమం మొదలు పెట్టింది. కోవిడ్ బాధితులు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈ మహమ్మారికి ఉచిత వైద్య సాయం పొందే ఏర్పాట్లు చేసింది. దీనికోసం ట్రస్ట్ వారు ప్రత్యేకంగా ఒక నెంబర్ ను కేటాయించారు. టెలీ మెడిసిన్ సాయం కావాలనుకునే కోవిడ్ పేషెంట్లు 8801033323 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. అలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్ కు టెలీ మెడిసిన్ సేవలు అందించించే జూమ్ కాల్ లింక్ వెళుతుంది.
అలా కోవిడ్ బాధితులు జూమ్ లింక్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు పొందవచ్చు. అవసరం ఉన్న కోవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉచితంగా మందుల పంపిణీ కూడా జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు కోవిడ్ బాధితులకు కామన్ గా జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. మిస్డ్ కాల్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి వైద్య సౌకర్యం పొందడానికి లైన్ క్లియర్ అవుతుందని ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రకటించింది.


