TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఉచిత గ్యాస్ కావాలంటే ఆధార్ తప్పనిసరి...

Published on: Wed Mar 8, 2017 2:49PM

 

ప్రధాని మంత్రి మోడీ ఉజ్వల్‌ యోజనా కింద పేదమహిళలకు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్  కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉజ్వల్‌ యోజనా పథకం కింద ఐదు కోట్ల మంది పేదమహిళలకు ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నారు. ఆధార్‌ సంఖ్యలేనివారు మే 31వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక వేళ ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూసేవారు ఉంటే వారు తమ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీగానీ, ఆ దరఖాస్తు కాపీని కానీ ఇవ్వాలి. వీటితోపాటు బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఫొటోగ్రాఫ్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డ్‌, పాన్‌ నెంబర్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, ఫొటో ఉన్న సర్టిఫికెట్‌పై గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకంతో ఇవ్వాల్సి ఉంటుంది. కాగా గత ఏడాది ఎల్‌పీజీ సబ్సిడీ సిలిండర్లకు ఆధార్‌ గుర్తింపు తప్పనిసరి చేయగా.. ఇప్పుడు దానిని ఉచిత సిలిండర్లకు కూడా తప్పనిసరి చేశారు.