TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంజాబ్‌లో ఫ్రీ క‌రెంట్‌.. ఏపీలో బాదుడే బాదుడు.. జ‌గ‌న‌న్న పాల‌న‌కు ప‌నికిరాడా?

Published on: Sat Apr 16, 2022 2:30PM

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్  రాష్ట్రంలో గృహ వినియోగదారులందరికీ 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. అయితే మాన్ ప్రకటన తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. మూడేళ్ల కిందట అంటే జగన్ ఏపీ సీఎంగా పీఠం అధిష్టించే సమయానికి మిగులు రాష్ట్రంలో ఉన్నఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 'అంధ'ప్రదేశ్ గా మారిపోయింది. విద్యుత్ చార్జీలను గణనీయంగా పెంచేశారు సీఎం జ‌గ‌న్‌. పెంచిన ఛార్జీల‌తో జ‌నాల న‌డ్డి విరుగుతుంటే.. ఇక కోత‌ల‌తో మ‌రింత క‌ష్టాల పాలు జేశారు. వేసవిలో విద్యుత్ కోతలతో ప్రజల పరిస్థితిని దుర్భరంగా మార్చేసింది. ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడే ప్ర‌క‌టించి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కుప్ప‌కూల్చేశారు. ఒక పక్క పంజాబ్ రాష్ట్రంలో గృహ వినియోగదారులందరికీ ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం తీసుకుంటే.. ఏపీలో సీన్ రివర్స్ అయ్యింది. మూడేళ్ల సీఎం కంటే.. మూన్నాళ్ల ముఖ్య‌మంత్రే బెట‌ర్ అనిపిస్తోంది. 
 
బీసీలు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి పంజాబ్ లో ఇంత వరకూ ఇస్తున్న200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను కూడా 300 యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ నిర్ణయం జులై 1నుంచీ అమలులోనికి వస్తుందని సీఎం ప్రకటించారు. గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించడానికి వ్యవసాయానికి సబ్సిడీ విద్యుత్ లో కోత విధిస్తున్నామంటూ వస్తున్న విమర్శలను ఆయన తోసి పుచ్చి వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా గత ఏడాది డిసెంబర్ 31 వరకూ ఉన్న గృహ విద్యుత్ బకాయిలన్నీ మాఫీ చేసింది. 
ఒక వైపు పంజాబ్ రాష్ట్రం గృహావసరాలకు 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందించ గలుగుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో  మాత్రం చార్జీలు పెంచుతూ జనం మీద భారం మోపుతున్నాయి. 

ఘనంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ప్రకటించి అమలు చేస్తున్న తెలంగాణ ఇప్పుడు దానికి 7 గంటలకు కుదించింది.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ భుజాలు జరుచుకున్న జగన్ సర్కార్ ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ వినియోగంపై నియంత్రణ పెట్టింది.  వద్యుత్ విధానంలో అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వద్యుత్ సంస్థలతో ఒప్పందాల రద్దే ఇప్పుడీ పరిస్థితికి కారణమని విద్యుత్ రంగ నిపుణులు సైతం వేలెత్తి చూపుతున్నారు.