TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం...

Published on: Sat Mar 18, 2017 2:55PM

 

ఫ్రాన్స్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఫ్రాన్స్ లోని పారిస్‌లోని ఓర్లీ ఎయిర్‌పోర్టులో ఓ అధికారి వద్ద నుండి ఓ వ్యక్తి ఆయుధాన్నిలాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ చర్యకు వెంటనే స్పందించిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో కాల్పుల శబ్దాలకు విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటన అనంతరం ఎయిర్‌పోర్టును ఖాళీ చేయించిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే గాయపడిన నిందితుడు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు.