TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 రేవంత్ రెడ్డితో భేటి అయిన ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లి యు

Published on: Fri Aug 16, 2024 3:03PM

అమెరికా నుంచి తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి వచ్చీ రాగానే ఢిల్లీలో బిజీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లి యు ఢిల్లీలో కలిశారు. రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం  గురువారం ( ఆగస్టు 15) న ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు ఆయన పలు కంపెనీల ప్రతినిధులు ఆయనను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఫాక్స్ కాన్ చైర్మన్... దేశ రాజధానిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు.
త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తానని ఈ సందర్భంగా యంగ్ లి యూ తెలిపారు. పరిశ్రమలు, సేవా రంగాలను విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో ముఖ్యమంత్రి విజన్ అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు సానుకూలత ఉందన్నారు.