చంద్రబాబు నాలుగేళ్ళ పాలన

 

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఏపీ పరిస్థితిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి.. ఏపీకి మంచి రాజధాని నిర్మాణం సాధ్యమేనా?.. కంపెనీలు, విదేశీ పెట్టుబడులు వస్తాయా?.. ఏపీ మిగతా రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చెందుతుందా?.. ఇలా చాలా ప్రశ్నలు ఏపీ ప్రజల్ని వేదించాయి.. ఆ ప్రశ్నల్లో నుండే ఒక సమాధానం వచ్చింది.. ఆ సమాధానమే చంద్రబాబు.. ఇపుడున్న పరిస్థితుల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలివితేటలు, ముందుచూపు ఉన్న చంద్రబాబు, సీఎం అయితే ఏపీ కి న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మారు.. గెలిపించారు.. చంద్రబాబు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. ఈ వయస్సులో కూడా ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం కష్టపడుతున్నారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడూ పరిస్థితులు అనుకూలంగా లేవు.. ఇప్పుడూ అనుకూలంగా లేవు.. అయినా చంద్రబాబు పట్టువదలకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందన్న ఆశతో బాబు, 2014 లో బీజేపీతో నడిచారు.. కానీ బీజేపీ మాట మార్చి ప్రత్యేక ప్యాకేజీ అంది.. దానికి కూడా బాబు అంగీకరించి నాలుగేళ్లు సహనంతో వేచి చూసారు.. కానీ కేంద్రం ఏపీకి మొండిచెయ్యి చూపడంతో.. బాబు బీజేపీ కి దూరమయ్యారు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేకహోదా కోసం బీజేపీతో పోరాడుతున్నారు.. మరోవైపు 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్.. తరువాత టీడీపీని విభేదించి.. విమర్శలు చేస్తూ.. 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. వైసీపీ కూడా బలమైన ప్రతిపక్షంగా ఉంది.. ఇన్ని ప్రతికూలతలు మధ్య కూడా బాబు ఏ మాత్రం తడబడకుండా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

అమరావతిని ప్రపంచంలో ఉన్న గొప్ప రాజధానుల్లో ఒకటిగా నిలుపుతానన్న బాబు.. అన్నట్టుగానే ఆ దిశగా పనులు మొదలుపెట్టారు.. భూసేకరణ చేసి, అద్భుతమైన డిజైన్లు వేయించి పనులు ప్రారంభించారు.. కానీ కేంద్రం నుండి సరైన సహకారం లేక పనులు నెమ్మదిగా సాగుతున్నాయని బాబు ఆరోపణ.. అలానే ప్రతిపక్షాలు కూడా బీజేపీతో కుమ్మక్కై టీడీపీని కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని బాబు ఆవేదన.

ఏదేమైనా ప్రజలు బాబు అభివృద్ధి చేయగలడని నమ్మి ఓటేశారు.. బాబు కూడా దానికి తగ్గట్టే గొప్ప రాజధాని నిర్మాణ ప్రణాళికలు మొదలుపెట్టారు.. అలానే విద్యాసంస్థలు, కంపెనీలు రాష్ట్రానికి తేవడంలో విజయం సాధించారు.. అయితే ప్రభుత్వం మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ.. ప్రజలు బాబు పాలన పట్ల సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.. రాజకీయ విశ్లేషకులు కూడా 'మళ్ళీ బాబు సీఎం అవ్వడమే కరెక్ట్ అని, ఒకవేళ వేరేవాళ్లు సీఎం అయితే రాజధాని పనులు మళ్ళీ మొదటికొస్తాయనీ.. దానివల్ల ఏపీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని' భావిస్తున్నట్టు తెలుస్తుంది...