TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తాడేపల్లి గూడెం సహా ఏపీలో నాలుగు కొత్త విమానాశ్రయాలు!

Published on: Fri Jan 30, 2026 7:38AM

ఆంధ్రప్రదేశ్ లో  కొత్త విమానాశ్రాయాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలోనే  తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలపై అధ్యయనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.

తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటునకు రాష్ట్రం కోరిందని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ సమాధానమిచ్చారు.  ఏపీ ప్రభుత్వం నుంచి ఈ నెలలోనే ఈ అభ్యర్థన అందిందనీ, విమానాశ్రయానికి అవసరమైన స్థల వివరాలను కూడా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అందజేసిందని ఆయన వివరించారు.

 అలాగే రాష్ట్రంలో మరో మూడు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రాథమిక అధ్యయనాలు జరిగినట్లు వివరించారు.  కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలులో విమానాశ్రయాల నిర్మాణానికి  అధ్యయనం పూర్తి చేసిం దనీ, వీటి కోసం అవసరమైన భూమి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదనలు పంపిందని చెప్పారు.