TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.!

Published on: Fri Jul 3, 2026 12:51PM

ప్రకాశం జిల్లా   కంభం పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  వివరాలిలా ఉన్నాయి. పెళ్లి బృందంతో వెడుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.   ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధానకారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.

 మార్కాపురం-కంభం ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఈ రోడ్డుపై ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఉండగా, మృతులందరూ  గిద్దలూరు నల్లబండ బజారుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారే. మృతులలో  16 ఏళ్ల అలకనంద, 20 ఏళ్ల అంకాలు, నగేష్‌, రెండేళ్ల చిన్నారి ఉన్నారు.  మృతులంతా ఒకే కుటుం బానికి చెందిన వారు.