TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జైల్లో పెడితే హాయిగా రెస్ట్‌ తీసుకుంటా : కేటీఆర్

Published on: Mon Jun 16, 2025 7:52PM

 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం నేరుగా తెలంగాణ భవన్  చేరుకుకోని మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ఒక లొట్టపీసు కేసు అని, ముఖ్యమంత్రి ఓ లొట్టపీసు అని తీవ్ర స్ధాయిలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఒకటే షోకు. నేను నెల రోజులు జైలులో ఉన్న .. వీళ్లను కూడా కొన్నిరోజులు జైలుపెట్టాలి అన్నదే ఆయనకున్న షోకు, పైశాచిక ఆనందం ఒక్కటే అని కేటీఆర్ విమర్శించారు. అందుకే ఇవాళ అధికారులకు నేను చెప్పిన.. మీకు పై నుంచి ఆదేశాలు రావొచ్చు ఇప్పటికే.. వస్తే పెడితే జైలులో పెట్టుకొమ్మని చెప్పాను. పదిహేను రోజులు విశ్రాంతి తీసుకొని వస్తానని చెప్పాను. 

ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. తప్పు చేయలేదు.. తలదించుకునే పని ఎంతమాత్రం చేయలేదని ఆయన తెలిపారు. ఈ ఫార్ములా కార్‌ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే రేవంత్‌రెడ్డి పారిపోయిండని ఆయన అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్‌ పరీక్ష చేయించుకుంటా.. నువ్వు రా రేవంత్‌కు సవాల్ విసిరారు. నాపై ఇప్పటి వరకు 14 కేసులు పెట్టారు. ఇంకో 1400 కేసులు పెట్టుకో.. అవసరమైతే జైలులో పెట్టుకో. ఏమన్న చేసుకో. భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినం. అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తే భయపడేటోడు ఎవడూ లేడు. నీ ఉడుత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమని కేటీఆర్ మండిపడ్డారు.