TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీటీడీ చైర్మన్ గా సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్  ఎన్ వి రమణ  ? 

Published on: Fri Sep 27, 2024 10:25AM

టిటిడి చైర్మన్ గా సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి  రమణ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత  ప్రక్షాళన చేపట్టింది. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఈవో ధర్మారెడ్డిని తొలగించినప్పటికీ చైర్మన్ పదవిని ఎవరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూలో పందికొవ్వు ఉందని ల్యాబ్ రిపోర్ట్ రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. పరమపవిత్రమైన తిరుమల క్షేత్రంలో జంతు అవశేషాలతో కూడిన లడ్డూలను భక్తులకు విక్రయించడం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే తిరుపతి లడ్డూ పరీక్షలు జరిగాయి. నాణ్యత లోపాలు  ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో కూటమి ప్రభుత్వం ఈ పరీక్షలు చేపట్టింది. ల్యాబ్ రిపోర్టు ఆలస్యంగా వచ్చాయి. లడ్డూలో పందికొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.  గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో  వైసీపీ ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది.  గత వైసీపీ  ప్రభుత్వంలో చైర్మన్లుగా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి దోషులుగా నిలబడాల్సి వచ్చింది. కీలకమైన టిటిడి చైర్మన్ పదవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తెరదించారు. ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్, సినీ నిర్మాత అశ్వినీదత్ పేర్లు వినిపించాయి. తాజాగా గురువారం మరో పేరు ప్రచారంలో వచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న ఎన్ వి రమణ ధర్మ పరిరక్షణ కోసం అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. రెండేళ్ల క్రితం ఆయన పదవీ విరమణ చేశారు.