TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు విజయసాయి

Published on: Thu May 28, 2026 3:38PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఈడీ విజయసాయిని ఇప్పటికే రెండు సార్లు విచారించింది. తాజాగా ఈడీ పిలుపు మేరకు విజయసాయి గురువారం (మే 28) మరో సారి విచారణకు హాజరయ్యారు. ఈ విచారకు ఆర్థిక లావాదేవీలు, ముడుపుల ఆరోపణలు, లిక్కర్ పాలసీ అమలు సమయంలో తీసుకున్న నిర్ణయాలపై కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. 

ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణంలో  పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవే త్తలు, మధ్యవర్తుల మధ్య భారీ మొత్తంలో డబ్బుల లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మద్యం సరఫరా ఒప్పందాలు, డిస్టిలరీల ఎంపిక, కమిషన్ల రూపంలో డబ్బుల బదిలీలపై ఈడీ దృష్టి పెట్టింది. 

ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తుల బ్యాంక్ ఖాతాలు, కంపెనీల ఆర్థిక లావాదే వీలు, షెల్ కంపెనీల ద్వారా జరిగిన డబ్బుల మార్పిడి వివరాలను ఈడీ సేకరించింది. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి పాత్రపై మరింత స్పష్టత కోసం విచారణ  మూడో సారి విచారణకు పిలిచింది.  గతంలో జరిగిన విచారణల్లో కూడా ఈడీ అధికారులు పలువురు వ్యాపారవేత్తలతో ఉన్న సంబంధాలు, మద్యం పాలసీ   నిర్ణయాల సమయంలో జరిగిన సమావేశాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు అడిగిన సంగతి విదితమే. తాజా విచారణ లో కూడా అదే అంశాలపై మరింత లోతుగా ఈడీ విజయసాయిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.