TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ ఎంపీ గోరంట్లకు పోలీస్ కస్టడీ విధించిన మొబైల్ కోర్టు

Published on: Mon Apr 21, 2025 9:27PM

 

 

పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు  ఏప్రిల్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు మాధవ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు రోజుల పాటు గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు వివరాలపై లోతుగా విచారించనున్నారు.

మరోవైపు, ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాధవ్ పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పార్టీ నుంచి సస్పెండై అరెస్టు కూడా అయిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు మాధవ్ ను అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో గోరంట్ల మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.