రోజా టెన్ష‌న్.. ఎందుకో తెలుసా?

posted on: Feb 7, 2026 10:44AM

మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. తిరుమల వెంకన్న దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ప్రైవేటు సంభాషణల్లో అదీ.. మరో  మాజీ మంత్రి జోగి రమేష్ ఎదురుగా అన్నట్లు చెబుతున్నారు. ఔను తెలిసి తెలిసీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నాం ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆమె అన్న మాటలకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ గా మారింది. 

వాస్తవానికి రోజా మంత్రిగా ఉన్న సమ యంలో రోజుకు వందలు వేలుగా టీటీడీ దర్శనం టోకెన్లను అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ కమేడియన్ కిరాక్ ఆర్పీ పలు మార్లు ఈ ఆరోపణలు చేశారు. అంతే కాదు.. టీటీడీ చైర్మర్ బీఆర్ నాయుడు కూడా ఆ చిట్టా అంతా తమ దగ్గర ఉందనీ, ఇదో పెద్ద కుంభకోణమనీ చెప్పడమే కాకుండా త్వరలోనే అన్ని విషయాలూ బయటపెడతామన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా తెలిసి తెలిసీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నాం.. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయంటున్నారు. రోజా మాటలు వాస్తవమే అయితే ఆమె వేంకటేశ్వరస్వామి విషయంలో తప్పు చేసినట్లు అంగీకరించేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

అయితే విచిత్రమేంటంటే.. అంత భ‌య ప‌డుతూ కూడా ఎందుకిలా చేశారన్నది ఇప్పుడో చర్చగా మారింది. సింథ‌టిక్ నెయ్యితో స్వామివారికి ల‌డ్డూలు చేసి పెట్టిన  పాపం ఊర‌కే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా ఈ దర్శనాలను మాత్రం ఆమె మానరు. మధ్యమధ్యలో కాశీ కూడా వెళ్లి వస్తుంటారు. పాపం చేశాను.. పరిహారం చూపండి అనో ఏమో రోజా ఈ దేవుళ్లను క్రమం తప్పకుండా దర్శించుకుని వస్తుంటారు.  

అవన్నీ పక్కన పెడితే వైసీపీలో రోజా కు ఏ మంత ప్రాముఖ్యత కనిపించడం లేదు. సోంత నియోజకవర్గం నగరిలో స్థానిక వైసీపీ నేతలు ఆమెపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సో..వచ్చే ఎన్నికలలో ఆమెకు వైసీపీ టికెట్ దక్కకుండా వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది.  ఇక ఏపీలో లాభం లేదు తమిళనాడు వెళ్లిపోయి.. టీవీకేలో సెటిల్ అవ్వడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదంటున్నారు.  మరిప్పుడు గత్యంతరం లేక వైసీపీలో గుర్తింపు కోసం చంద్రబాబును భల్లాల దేవుడు, జగన్ ను బాహుబలి అంటూ సినిమా డైలాగులతో రాజకీయం చేస్తున్నారని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...