TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళా కమిషన్ ఎదుటకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఎందుకో తెలుసా?

Published on: Tue Jun 30, 2026 12:59PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం (జూన్ 30) మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుడివాడ అమర్నాథ్ పై తీవ్ర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మేకప్ మంత్రి అంటూ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది.

అయితే గతంలో రెండు సార్లు విచారణకు హాజరు కావడానికి గడువు కాలాలంటూ కోరిన గుడివాడ అమర్నాథ్ ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అదలా ఉంటే.. తనపై ఆరోపణలపై అప్పట్లోనే స్పందించిన ఆయన.. తాను హోమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదంటూ వివరణ ఇచ్చిన  సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలూ సహజమేనన్న ఆయన వాటిని అడ్డం పెట్టుకుని తనపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.   సాధారమన్నారు.