తెలుగుదేశం గూటికి బాబూమోహన్

posted on: Oct 29, 2024 2:20PM

మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ తెలుగుదేశం గూటికి చేరారు. తాజాగా తెలుగు దేశం పార్టీ సభ్యత్వం  తీసుకున్నారు. మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ తాను ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడిస్తూ అందుకు సంబంధించిన ఫొటో విడుదల చేశారు.

 అంతకు ముందే ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. మరీ ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద బాబూమోహన్ సొంత గూటికి చేరినట్లైందని ఆయన రాజకీయ ప్రస్తానం గురించి తెలిసిన వారు అంటున్నారు.  
 

google-ad-img
    Related Sigment News
    • Loading...