TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాలి బెయిల్ స్కాం నిందితుడు..హైకోర్టు మాజీ జడ్జి మృతి

Published on: Mon Jan 18, 2016 11:32AM

గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాంలో నిందితుడిగా ఉన్న హైకోర్టు మాజీ జడ్జి ప్రభాకరరావు మృతి చెందారు.  ప్రభాకరరావు నిన్న ఉదయం 6.30 గంటల సమయంలో తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రభాకరరావు కుమారుడు డేవిడ్ ప్రశాంత్ తన తండ్రి ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన విగతజీవిగా ఉండటంతో డేవిడ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ముందు పోలీసులు ఆయనది సహజ మరణమని భావించినా ఆ తరువాత సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం 174 ఐపీసీ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అంతేకాదు ప్రభాకరరావు మృతిపై పోలీసులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాంలో నిందితుడిగా ఉన్నాననే అవమానాన్ని భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెవరైనా ఆయన మరణానికి కారకులా అని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ప్రభాకరరావు కొడుకు మాత్రం తన తండ్రిది సహజ మరణమేనని.. తన తండ్రి ఆత్మహత్య చేసుకోలేదని.. అనవసరంగా తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయోద్దని కోరారు.