గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అరెస్ట్
Published on: Fri Sep 27, 2024 11:19AM
.webp)
ఎపి గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో అతన్ని అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హాయంలో ఆయన అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎసిబి అధికారులు ఈ నెల 11న కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వంలో వెంకట్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అతనిపై శాఖాపర విచారణ చేసి సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వెంకట్ రెడ్డి హైకోర్టునునాశ్రయించారు. వెంకట్ రెడ్డితో పాటు మరో మూడు మైనింగ్ సంస్థలపై ఎసిబికేసులు నమోదు చేసింది. మొత్తం ఏడుగురిపై ఎసిబి కేసులు నమోదయ్యాయి.


