దినేష్‌రెడ్డి బీజేపీ తీర్థం?
Published on: Thu Aug 21, 2014 12:43PM

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి త్వరలో భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. డీజీపీగా పదవీ విరమణ చేసిన దినేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కేవలం లక్షా పదిహేను వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. త్వరలో ఆయన బీజేపీలో చేరతారని సమాచారం. దినేష్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారు. అయినప్పటికీ ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు తెలంగాణలో బంధుత్వాలు వున్నాయి. తెలంగాణలో బీజేపీ పుంజుకునే దశలో వున్నందున ఆయన బీజేపీ తెలంగాణ నాయకుడిగానే వుండే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.


