TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు..!!

Published on: Mon Aug 6, 2018 12:01PM

ఏపీలో ఎన్నికలు దగ్గరికొస్తున్న కొద్దీ పార్టీలలో చేరికలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీలో చేరికలు ఎక్కువగా ఉన్నాయి.. ఇప్పుడు ఈ చేరికల పరంపర వైసీపీలో కూడా మొదలవుతుంది.. టీడీపీలో ఇప్పటికే నాయకులు ఎక్కువగా ఉండటం, కొత్తగా వచ్చే వారికి సీట్ హామీ కష్టమవడంతో.. పార్టీలు మారాలనుకునేవారు ఇప్పుడు వైసీపీ వైపు కూడా చూస్తున్నారు.

 

 

తాజాగా ఈ లిస్ట్ లో ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి చేరారు.. ప్రస్తుతం రాంకుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నారు.. రీసెంట్ గా ఆయన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ప్రకటించింది బీజేపీ.. ఇలాంటి సమయంలో రాంకుమార్ రెడ్డి  జగన్ ను కలిశారు.. పాదయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్న జగన్ ను కలిసిన రాంకుమార్ రెడ్డి.. ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించి, వైసీపీ లో చేరికపై స్పష్టత ఇచ్చిన్నట్టు తెలుస్తోంది.. అలానే రాంకుమార్ రెడ్డి వెంకటగిరి టికెట్‌ను ఆశించినట్టు సమాచారం.. అయితే ఇప్పటికే ఆ స్థానంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.