కాంగ్రెస్ లోకి కిరణ్ రీఎంట్రీ

 

కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొంత కాలంగా వార్తలు వినిపించాయి.. అనుకున్నట్టుగానే కిరణ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈ సందర్బంగా మాట్లాడిన కిరణ్.. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది.. కాంగ్రెస్ తో నాది విడదీయరాని బంధం.. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తప్ప దేశానికి సరైన దశ దిశ రావు.. విభజన హామీలు నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది.. విభజన చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.. మొత్తానికి కిరణ్ రాకతో ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తోంది.. అలానే కిరణ్ త్వరలో ఏపీలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి కిరణ్ రాకతో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటుందో.